Dailyhunt
రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన

భారత రాష్ట్ర సమితి నాయకులు

మంచాల, సెప్టెంబరు 13: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చీరాల రమేష్‌ దుయ్యబట్టారు.

బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటిముట్టడి నేపథ్యంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ నేతలు చీరాల రమేష్‌, బహదూర్‌, బుస్సుపుల్లారెడ్డి, జానీపాష, జంబులకిషన్‌రెడ్డి, చిందం జంగయ్య, బద్రీనాథ్‌గుప్త, జగన్‌నెడ్డి, తదితరులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఇబ్రహీంపట్నం : కౌశిక్‌రెడ్డి, ఆరెకపూడి గాంధిల మధ్య తలెత్తిన వివాదం, నాయకుల అరెస్టుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. మండలాధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, మున్సిపల్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు, జెర్కోని రాజు, నిట్టు జగదీశ్వర్‌తోపాటు తదితరులను అరెస్టు చేశారు.

శంషాబాద్‌ రూరల్‌ : మల్కారం పీఎస్‌సీఎస్‌ చైర్మన్‌ బుర్కుంట సతీష్‌ను ఆయన నివాసం నర్కూడలో పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు.

షాబాద్‌ : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో షాబాద్‌ బీఆర్‌ఎస్‌ నాయకులను ముందస్తు అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

యాచారం : హరీ్‌షరావు, కౌషిక్‌రెడ్డిల అక్రమ అరెస్టుకు మండల కేంద్రంలో ధర్నా చేయడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ప్రణాళిక రూపొందించారు. నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడానికి సిద్దమయ్యారు. యాచారం, హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీ్‌సలు ఖాజుద్దీన్‌, యాదయ్య, ఎం, శ్రీనివా్‌సచారి, శ్రీనివా్‌సరెడ్డి, ప్రవీణ్‌, సాయిరెడ్డి, సాయిచారి,. కృష్ణ, గిరిలను అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు. కందుకూరు : అక్రమ అరెస్టులు చేయడం ఏమిటని ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎస్‌ సురేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత కాకి దశరథలు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తాండ్ర దేవేంతర్‌, పి.శ్రీహరి, పొట్టి ఆనంద్‌, తాళ్ల కార్తీక్‌, సురేష్‌, బొక్క దీక్షీత్‌రెడ్డి, జంగయ్య, సుదర్శన్‌రెడ్డి,ఎస్‌ వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కేశంపేట : ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణను రాష్ట్రవ్యాప్త సమస్యగా చూపించి, బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తుందని మండల కాంగ్రెస్‌ నాయకులు ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని బీఎ్‌సవై గార్డెన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు గూడ వీరేశ్‌, జగదీశ్వర్ప, యెన్నం శ్రీధర్‌ రెడ్డి, లంకాల సురేష్‌ రెడ్డి మాట్లాడారు. కౌశిక్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ పరసర్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకుని, ఒకరి ఇంటిపై మరొకరు దాడికి తెగబడ్డారని, వారిలో వారు ఘర్షణపడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. కాగా, నాయకులు స్థాయినిబట్టి మాట్లాడితే మంచిదని హితబోధ పలికారు. తండ్ర శ్రవణ్‌ రెడ్డి, గిరధర్‌ యాదవ్‌, భాస్కర్‌ గౌడ్‌, అనుమగళ్ల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

కేశంపేట : శుక్రవారం తెల్లవారుజామున కేశంపేట పోలీసులు షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను ఆయన స్వగృహం ఎక్లా్‌సఖాన్‌పేటలో హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ గణేష్‌, మాజీ సర్పంచ్‌లు తలసాని వెంకట్‌ రెడ్డి, కె. నవీన్‌ కుమార్‌, తోట ఆంజనేయులు, మాజీ కో అప్షన్‌ సభ్యుడు జమాల్‌ఖాన్‌, మాజీ ఉప సర్పంచ్‌ నరేష్‌ యాదవ్‌, సాజీద్‌, శ్రీనివాసులను ఆయా గ్రామాలలో అదుపులోకి తీసుకుని మాజీ ఎమ్మెల్యే ఇంటికి తరలించారు. సాయంత్రం వరకు పోలీసులు వారిని హజ్‌ అరె్‌స్టలో ఉంచారు.

షాద్‌నగర్‌ : షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మున్సిపల్‌ చైర్మెన్‌ కె నరేందర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తమపట్ల కక్షపూరితధోరణి అవలంభిస్తుందని విమర్శించారు. ఆమనగల్లు/కడ్తాల/తలకొండపల్లి : ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల పరిధిలో బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమనగల్లులో బీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్‌ పత్యనాయక్‌, రైతు సంఘం అధ్యక్షుడు రూపం వెంకట్‌ రెడ్డి, తలకొండపల్లిలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్‌ ను నిరసిస్తూ కడ్తాలలో మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌ ఇంటి నుంచి రోడ్డు మీదికి ఆందోళనకు వెళ్తున్న దశరథ్‌ నాయక్‌, ఆనంద్‌, వీరయ్య, పరమేశ్‌, నర్సింహలతో కలిపి 24 మందిని అరెస్ట్‌ చేశారు. కాగా, హరీశ్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ కడ్తాల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేస్తుండడంతో స్టేషన్‌ ఎదుట దర్నా నిర్వహించారు. చేవెళ్ల : ఆక్రమ అరెస్టులు చేయడం దారుణమని చేవెళ్ల మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, చేవెళ్ల బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌ అన్నారు. వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీ్‌సలు అరెస్టు చేశారు. మాజీ వైస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, మాజీ ఎంపీటీసీలు ఎల్లయ్య, సత్యనారాయణచారి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్‌ ఘనీ, మాజీ సర్పంచ్‌ మల్లారెడ్డి, తదితరులున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy