Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో ఏం బాగుందో చెప్పండి సోమేశ్ గారూ... : వీహెచ్

రాష్ట్రంలో ఏం బాగుందో చెప్పండి సోమేశ్ గారూ... : వీహెచ్

హైదరాబాద్: సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భగ్గుమన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా, సీఎస్ సోమేశ్ కుమార్ మాత్రం లాక్‌డౌన్ అవసరం లేదంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం బాగుందో ఆయన చెబితే బాగుంటుందని చురకలంటించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజ్ లేదని, పడకలు కూడా దొరకడం లేదని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఏమాత్రం తగ్గడం లేదని, ఈ విషయం సోమేశ్ కుమార్ గ్రహించాలని వీహెచ్ హితవు పలికారు. సీఎస్ వాస్తవాలను చెప్పాలని, ప్రజల ప్రాణాలు సర్కార్‌కు ముఖ్యం కాదా? అని ప్రశ్నించారు. కరోనాపై ఓ నిర్ణయం తీసుకొని, ప్రజల ప్రాణాలను కాపాడాలని వీహెచ్ ప్రభుత్వానికి సూచించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌పై వీహెచ్ ఫైర్ అయ్యారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బండి సంజయ్ 'మమతా ఖాన్' అని కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy