Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో మరో 4 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో మరో 4 కొవిడ్‌ కేసులు

  • తూర్పుగోదావరిలో 3, మన్యంలో 1... 30కి చేరిన పాజిటివ్‌లు

రాజమహేంద్రవరం అర్బన్‌, విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మంగళవారం ఒక్కరోజే ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. బుధవారం కూడా కొత్తగా మరో నాలుగు కేసులు వెలుగుచూశాయి. తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 30కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరు, రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌, కంబాల చెరువుకు చెందిన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడుకి పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో ఆయనను కేజీహెచ్‌లోనే ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy