Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌: మంత్రి లోకేశ్

రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌: మంత్రి లోకేశ్

తిరుపతి, జూన్ 12: కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ నమ్మకం, సంక్షేమంపై తిరుపతి దామినీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..

వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించామని.. దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమ అంటే ఎన్టీఆర్‌కు చాలా ప్రేమ అని తెలిపారు. నాడు కరువు వస్తే జోలె పట్టుకుని సీమ ప్రజలను ఆదుకున్నారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు.

రాయలసీమను రాయల్‌సీమగా మార్చామని మంత్రి చెప్పారు. రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్‌ అని కొనియాడారు. గొడ్డలి పార్టీ అరాచక పాలన చూశామన్నారు. టీడీపీ జెండా లేకుండా చేస్తామని నాడు వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారని.. ఇవాళ ప్రజలే వైసీపీ జెండా పీకేసి టీమ్‌ 11 తీర్పు ఇచ్చారని సెటైర్ విసిరారు. వైసీపీ అరాచకాలు చూస్తూ ఊరుకోమని.. రెడ్‌బుక్ దాని పని అది చేసుకుంటూపోతుందని స్పష్టం చేశారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 'మనది గూగుల్‌... వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్‌జెట్‌.. వాళ్లది ఫ్యాక్షన్‌. మనది కియా.. వాళ్లది కిడ్నాప్‌. మనది క్రెడిబిలిటీ.. వాళ్లది క్రిమినాలిటీ' అంటూ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.


వారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు

పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు జేసీ ప్రభాకర్ సిద్ధం.. అడ్డుకున్న పోలీసులు

Read Latest AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy