Monday, 14 Jun, 6.32 pm ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
రైతులను ఆదుకోవడంలో జగన్ విఫలం: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

అమరావతి: రైతులను ఆదుకోవడంలో సీఎం జగన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం బకాయిలు, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు లభించక అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న కలెక్టర్ల కార్యాలయాల ఎదుట తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు ప్రకటించారు. క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపుల్లోనూ మోసం జరుగుతుందని చెప్పారు. ఈ-క్రాప్ బుకింగ్ సమస్యలతో రైతులు నష్టపోతున్నారన్నారు. తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై పోరాటం చేస్తామని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top