Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

శ్రీశైలం, సెప్టెంబర్ 2: శ్రీశైలం జలాల కోసం వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి పేరుతో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన కొడుకు రవి కిషోర్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.

ఎల్ నినో ప్రభావం వల్ల నీరు వచ్చే పరిస్థితి లేదని, అందువల్ల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆరు నెలల క్రితమే స్పష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. కానీ వైసీపీ నాయకులు రైతులను అడ్డం పెట్టుకుని శ్రీశైలం జలాల కోసం పోరాటాలు చేయడం రైతులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని ఆయన అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రైతులను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు.

రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వైసీపీ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు రైతులకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. 'వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో నీటి సమస్యలను పరిష్కరించాలని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే మీరేం చేశారు.. పోలీసులతో రైతులను అడ్డగించలేదా..? ఆనాడు ఏం అయింది మీ చిత్తశుద్ధి?' అని ఎమ్మెల్యే నిలదీశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy