Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులను ఇబ్బంది పెట్టిన దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు..

రైతులను ఇబ్బంది పెట్టిన దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు..

లూరు జిల్లా: అన్నదాతలతో కన్నీరు పెట్టించిన దొంగల ముఠాకు నూజివీడు రూరల్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. కొన్ని నెలలుగా రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి భరతం పట్టారు.

నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. ముసునూరు మండలంలో కొన్ని నెలలుగా దొంగలు రెచ్చిపోతున్నారు. పలు గ్రామాల్లో రాత్రి వేళ వ్యవసాయ మోటార్ల విద్యుత్ తీగలను దొంగిలిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో పంట పొలాల్లోనే విద్యుత్ తీగలకు కాపలా కాసే దుస్థితి నెలకొంది.

దొంగల ఆగడాలు ఆగకపోవడంతో పోలీసులను బాధిత రైతులు ఆశ్రయించారు. పకడ్బందీగా గస్తీ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. చోరీ చేసిన విద్యుత్ తీగలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తుకు బానిసలై దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో నిందితులు తెలిపారు. అనంతరం దొంగలను నూజివీడు కోర్టు వరకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు పోలీసులు. ఆరుగాలం కష్టించి అందరికీ అన్నం పెట్టే రైతన్నలను బాధపెట్టిన దొంగలను పట్టుకుని శిక్షించిన పోలీసులపై ముసునూరు మండల ప్రజలు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు దొంగల బెడద తప్పడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

.

సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy