Thursday, 23 Jan, 11.49 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
రజనీ వ్యాఖ్యలపై రగులుతున్న రాజకీయం

  • ఆయనంటే అన్నాడీఎంకేకు భయం లేదు: మంత్రి జయకుమార్‌
  • సారీ చెప్పరా?: ఓపీఎస్‌ ఆగ్రహం
  • ద్రావిడర్‌ విడుదలై కళగం ధర్నా
  • పోయెస్‌ గార్డెన్‌లో ఉద్రిక్తత

పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా చేసిన ప్రకటనపై రాజకీయం రగులుకుంది. ప్రధాన ప్రతిపక్షాలతో బాటు అధికార అన్నాడీఎంకే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. రజనీ క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి జయకుమార్‌, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తదితర నేతలు డిమాండ్‌ చేశారు. ఇక రజనీ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం కూడా పలుచోట్ల ధర్నాలు జరిగాయి. ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు, కార్యకర్తలు రజనీ నివాసగృహం ముట్టడికి యత్నించారు. రజనీ వ్యాఖ్యలపై బీజేపీ, సంఘపరివార్‌ నేతలు సామాజిక ప్రసార మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేశారు.

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు, సంఘసంస్కర్త పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా చేసిన ప్రకటనపై ఇటు ప్రధాన ప్రతిపక్షాలు, అటు అధికార అన్నాడీఎంకే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రజనీ వ్యాఖ్యలు పెరియార్‌ను కించపరిచే విధంగానే వున్నాయని, ఈ విషయంలో ఆయన ప్రవర్థిస్తున్న నిర్లక్ష్యధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప ముఖ్య మంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ఓ ప్రకటన జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డి. జయ కుమార్‌ పెరియార్‌పై విమర్శలు చేసి రజనీ ఘోర తప్పిదం చేశారని ఆరోపించారు. రజనీ అంటే అన్నా డీఎంకేకు భయంలేదని, ఎంతమంది రజనీకాంత్‌లు వచ్చినా తమ పార్టీ కంచుకోటలా స్థిరంగానే వుంటుం దన్నారు. ఇక రజనీ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నాడు కూడా పలుచోట్ల ధర్నాలు జరిగాయి. చెన్నైలో పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పా లంటూ ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు, కార్యకర్తలు బుధవారం ఉదయం ఆందోళనకు దిగి రజనీ నివాసగృహాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోయెస్‌ గార్డెన్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్‌ మంత్రి సెంగోటయ్యన్‌ కూడా రజనీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎండీఎంకే నేత వైగో సైతం రజనీ పెరియార్‌ గురించి ప్రస్తావించడం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ హర్షం

పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలు చేసిన రజనీ సారీ చెప్పనని ప్రకటించడం పట్ల బీజేపీ. సంఘపరివార్‌ నేతలు సామాజిక ప్రసార మాధ్యమాల్లో హర్షం ప్రకటిస్తూ సందేశాలు పొందుపరస్తున్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ సైతం రజనీకి మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పెరియార్‌పై వ్యాఖ్యలు చేసి రజనీ ద్రవిడ సిద్ధాంతాలకు సవాలు విసిరారంటూ ద్రవిడకళగం, పెరియార్‌ ద్రవిడ కళగం వంటి పార్టీలు కూడా ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో సందేశాలు పొందుపరుస్తున్నాయి.

పెరియార్‌ సిద్ధాంతాలు పఠించండి

ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు పెరియార్‌ సందేశాలు సమున్నతమైనవని, తనలాంటి రాజకీయ నాయకులు ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఆయనే కారణమని ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నారు. పెరియార్‌ సిద్ధాం తాలను రజనీకాంత్‌ పూర్తిగా చదివి అర్థం చేసుకో వాలన్నారు. పెరియార్‌ను విమర్శించడం అంటేనే తేనె తుట్టెపై రాయి విసరడం లాంటిదని ఆయన పేర్కొన్నారు.

సారీ చెబితే గౌరవం పెరిగేది

రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్‌ మాట్లాడు తూ ఆధారాలు లేకుండా పెరియార్‌పై వ్యాఖ్యలు చేసిన రజనీ భేషరతుగా క్షమాపణలు చెప్పి వుంటే ఆయన గౌరవం పెరిగేదని అన్నారు. రాయపురంలో బుధవారం ఉదయం విద్యార్థులకు ఉచిత సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ 1971లో జరగని ఓ సంఘటన గురించి రజనీ మాట్లాడినందువల్ల ఎలాంటి లాభం పొందాలను కుంటు న్నారో తనకు అర్థం కావటం లేదన్నారు. పెరియార్‌, అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లితే అన్నాడీఎంకే పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. రజనీ అంటే అన్నాడీఎంకేకు భయం లేదని, ఒక వేళ ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు ఆ భయం వుందేమోనని జయకుమార్‌ అన్నారు. రజనీ ఇకనైనా అనవసరపు వివా దాల జోలికి వెళ్ళకుండా మౌనం పాటిస్తే మంచిదన్నారు.

అవాస్తవాలు చెప్పొద్దు

ఏదో ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఆధారంగా చూపి పెరియార్‌పై రజనీ విమర్శలు చే య డం వింతగా విడ్డూరంగా వుందని ఎండీఎంకే నేత వైగో అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో పెరియార్‌ను మహా సంఘ సంస్క ర్తగా, ప్రజలలో ఆత్మగౌరవాలను పెంపొం దించిన నేతగా, మూఢ నమ్మకాలను పార ద్రోలిన మహానేతగా భావించి ఆ మహానేత సిద్ధాం తాలను చదవాలని ఆరాటప డుతున్నారని, ఈ విషయం తెలియని రజనీ కాంత్‌ అవాస్తవాన్ని వాస్త వంగా సభాము ఖంగా ప్రకటించడం గర్హనీయమని పేర్కొ న్నారు.

అసందర్భ వ్యాఖ్యలు వద్దు

నటుడు రజనీకాంత్‌ పెరియార్‌ గురించి అసందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. దివంగత నాయకులపై అందరికీ విరుద్ధభావాలు ఉంటాయని, అయితే వాటిని అనువుగాని చోట అసం దర్భ ంగా విమర్శిం చటం భావ్యం కాదని అన్నారు. ఇకనైనా పెరియార్‌ వంటి చారిత్రక పురు షులను గురించి మాట్లాడేటప్పుడు రజనీ ఆచి తూచి వ్యవహరించాలని హితవు చెప్పారు.

రజనీ ఇంటి ముట్టడి యత్నం

ఇదిలా వుండగా బుధవారం ఉదయం రజనీ ఇంటిని ముట్టడించేందుకు ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. పెరియార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌ తక్షణమే క్షమా పణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సెమ్మొళి పూంగా ప్రాం తం నుంచి నిరసన ర్యాలీ జరిపారు. ర్యాలీకి ఆ పార్టీ జిల్లా శాఖ కార్యదర్శి ఉమాపతి నాయకత్వం వహించారు. ఈ ప్రదర్శనలో రజనీ చిత్రపటాలకు నిప్పం టించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత రాధాకృష్ణన్‌ రోడ్డులో ర్యాలీని కొనసాగిస్తూ రజనీ నివాస ముంటున్న పోయెస్‌ గార్డెన్‌ ప్రాంతంవైపు దూసు కెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ కాపలా కాస్తున్న పోలీసులు ఇనుప బారికేడ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి వారి ప్రయ త్నాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పోలీసులకు నడుమ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ తర్వాత ప్రదర్శనలో పాల్గొన్న వంద మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లలో తరలించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy

related stories

Top