Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రవీంద్రపై ప్రచారం శోచనీయం: మాజీ మంత్రి

రవీంద్రపై ప్రచారం శోచనీయం: మాజీ మంత్రి

కృష్ణా: మచిలీపట్నంలో జరిగిన వైసీపీ నేత భాస్కర్ రావు హత్యను టీడీపీ ఖండించింది. భాస్కర్ రావు హత్యపై మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు స్పందించారు. హత్యలను ప్రోత్సహించే తత్వం తమ పార్టీది కాదని, తమకు ఆ అవసరం కూడా లేదని నరసింహారావు స్పష్టం చేశారు. భాస్కర్ రావు హత్య వెనుక కొల్లు రవీంద్ర హస్తం ఉందని ప్రచారం జరగడం శోచనీయం అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. 1982 నుండి టీడీపీలో తమ కుటుంబం కొనసాగుతోందని ఆయన చెప్పారు. నాటి నుండి నేటి వరకు అన్ని పార్టీలతోనూ సఖ్యతతో ఉన్నామని, ఎక్కడా స్వార్థ రాజకీయాలు చేయలేదన్నారు. తన సొంత తమ్ముడు నటరాజ్ సినిమా థియేటర్‌లో హత్యకు గురైతే 10 సంవత్సరాలు ఆ బాధను అనుభవించామని చెప్పారు.

కులపరంగా ఏవైనా సమస్యలు, తగదాలు వస్తే రాజీ చేసి బాధితులకు న్యాయం చేయమని పోలీసులకు చెప్పామే తప్పా.. ఎవరిని మేము సమర్థించడం, కక్షలు ప్రొత్సహించడం చేయలేదని నరసింహారావు స్పష్టం చేశారు. తానే సౌమ్యుడు అనుకుంటే తనకంటే సౌమ్యుడు రవీంద్రను రాజకీయాల్లోకి తెచ్చారని ఇప్పటికీ అంటారని ఆయన చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy