Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రెచ్చిపోయిన రౌడీమూకలు.. ఏబీఎన్ బృందంపై దౌర్జన్యం

నెల్లూరు: జిల్లాలోని బోడిగోడితోట శ్మశానవాటికలో అధికార పార్టీ శ్రేణుల దందాతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా కష్ట కాలంలోనూ ప్రజలను తిప్పలు పెడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. శ్మశాన వాటికలో ఒక్కో మృతదేహాం ఖననానికి రూ.10వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తూ ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నారు. బాధితుల పరిస్థితిని చిత్రీకరించేందుకు వెళ్లిన ఏబీఎన్ బృందంపై రౌడీమూకలు దౌర్జన్యం చేశాయి. వీడియోలు తీయొద్దంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశారు. ఏబీఎన్‌తో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు.. వారి బాధలను చెబుతుండగా రౌడీ మూకలు గందరగోళం సృష్టించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy