నెల్లూరు: జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో జరిగిన మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ వసుంధర డిమాండ్ చేశారు. నేడు వసుంధర మీడియాతో మాట్లాడుతూ.. రెహానా కేసుని మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లు సుమోటోగా తీసుకోవాలని కోరారు. అంగన్ వాడీల్లో పనిచేయాల్సిన వర్కర్లను అధికారుల ఇళ్లలో పాచి పనులు, బాడీ మసాజ్‌లు చేయడానికి పంపడం సిగ్గుచేటన్నారు. మహిళలకి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెబుతున్న సీఎం జగన్ వెంటనే స్పందించాలన్నారు.
