Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్

రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్

స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఓటమి పాలయ్యారు.

మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో ఆమె మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో పరాజయం చెందారు. ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించింది.

ట్రయల్స్‌లో బాగా రాణించి.. అంతర్జాతీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు, అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్‌లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు ఈ ఓటమి గండికొట్టింది. గత మ్యాచ్‌లో నిషుతో హోరాహోరీగా జరిగిన బౌట్‌లో వినేశ్ తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. ఫైనల్ ముంగిట ఆమెకు మీనాక్షి చేతిలో పరాజయం ఎదురైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy