Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

మరావతి, జూన్4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జూన్ 4, 2024 చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు.

విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చరిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లని పేర్కొన్నారు. ఆ విజయం తమకు అధికారం కాదని... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత అని ఉద్ఘాటించారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం..

ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని వెల్లడించారు. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది తమ సంకల్పమని వ్యాఖ్యానించారు. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy