చెస్ ఒలింపియాడ్
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్) : చెస్ ఒలింపియాడ్ రెండో రౌండ్‌లోనూ భారత జట్లు విజయాలు నమోదు చేశాయి. గురువారం జరిగిన ఈ రౌండ్ ఓపెన్ విభాగంలో పురుషుల జట్టుకు ఇండోనేసియా నుంచి ప్రతిఘటన ఎదురైంది.
అయితే మనోళ్లు 2.5-1.5 స్కోరుతో ప్రత్యర్థిపై గెలుపొందారు. ప్రజ్ఞానంద, గుకేష్, విదిత్ గుజ్‌రాతీ తమ గేమ్‌లను డ్రాగా ముగించగా, నిహాల్ సరీన్ కీలక విజయం అందుకున్నాడు. మహిళల విభాగంలో భారత్ 3.5-0.5తో ఫిన్లాండ్‌పై నెగ్గింది.. దివ్యా దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, సావిత్రి శ్రీ ప్రత్యర్థులను చిత్తు చేశారు. వైశాలీ రమేష్ బాబు గేమ్ డ్రా అయ్యింది.
ఈ వార్తలనూ చదవండి:

