Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష: షర్మిల

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష: షర్మిల

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ విషయమై రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అందరూ అండగా నిలబడాలని అన్నారు. అయితే ఈ ఆందోళనలకు తాను హాజరు కాలేకపోవచ్చని, కోవిడ్ దృష్ట్యా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అందరూ కలిసి రావాలని, తెలంగాణలో ఇక భవిష్యత్ తమదేనని అన్నారు. తమతో కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy