Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేషన్‌ బస్తాలో పది శాతానికి మించి నూకలే..

రేషన్‌ బస్తాలో పది శాతానికి మించి నూకలే..

  • బియ్యాన్ని దొంగిలించి... నూకలతో భర్తీ చేస్తున్న మిలర్లు

  • దోపిడీలో ఇదో రకం... బస్తాకు 10 కిలోలకు పైగా కొట్టేస్తున్న వైనం

హనుమకొండ: పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యాన్ని కొందరు మిల్లర్లు దిగమింగుతున్నారు.

సీఎంఆర్‌ బియ్యాన్ని కాజేస్తున్న మిల్లర్లు అది చాలదన్నట్లు మరో మార్గంలో కూడా అప్పనంగా బుక్కుతున్నారు. రేషన్‌ షాపులకు సరఫరా అయ్యే బియ్యం బస్తాల నుంచి బియ్యాన్ని లాగేస్తున్నారు. ఆ స్థానంలో నూకలు నింపుతూ దోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ నిఘా డొల్లాతనం, మిలర్ల నుంచి అందే అమ్యా మ్యాల వల్ల పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే అరోపణలు నెలకొన్నాయి.

పది శాతానికి మించి నూకలు

బియ్యం బస్తాలో నూకలు ఉండడం సహజం. అ యితే ఇందుకు నిర్దేశిత శాతం వరకే పరిమితి ఉం టుంది. రేషన్‌ షాపులకు 50 కిల్లోల బస్తాల రూపంలో సన్న బియ్యం సరఫరా అవుతాయి. ప్రభుత్వ నిర్దేశిత నిబంధనల మేరకు బియ్యంలో 10 శాతం నూకలు ఉండాల్సి ఉంటుంది. కానీ కొందరు మిల్లరు, అధికారులు మిలాఖాత్‌తో అధిక శాతంలో నూకలు నింపుతూ బియ్యాన్ని మింగేస్తున్నారు. 50 కిలోల బస్తాలో 10 నుంచి 12 కిలోల బియ్యాన్ని కాజేసి ఆ స్థానంలో నూకలను నింపేస్తున్నారు.

 ఇలా ప్రతి బస్తా నుంచి కొట్టేసిన బియ్యాన్ని క్వింటాలు, మెట్రిక్‌ టన్నులుగా మార్చుకున్న తదుపరి మిల్లరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో పౌర సరఫరాల శాఖ అధికారుల భాగస్వామ్యం తోడవ్వడంతో దందా నిరాటంకంగ సాగుతోంది. అప్పనంగా బియ్యాన్ని బుక్కుతూ కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని సరఫరా చేస్తుండడంతో మిల్లరు ఇదే అదనుగా నూకలను అధిక మొత్తంలో కలిపి బియ్యాన్ని దోచేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy