Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. నలుగురి మృతి

రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. నలుగురి మృతి

ఇంటర్‌నెట్ డెస్క్: తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఓ యువకుడు రెస్టారెంట్‌లో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోగా..

8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ తుర్కియేలోని మెర్సిన్‌ సిటీలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 17 ఏళ్ల ఓ యువకుడు సోమవారం రాత్రి టార్సస్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న షాట్ గన్‌తో రెస్టారెంట్‌లోని వారిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు.

ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని రెస్టారెంట్ యజమాని, రెస్టారెంట్ సిబ్బంది, పశువుల కాపరి, ట్రక్ డ్రైవర్‌గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు బృందాలు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy