ముంబై: రతన్ ఇండియా పెట్టుబడులున్న రివోల్ట్ మోటార్ తక్కువ ధరలో ఆర్‌వీ 1 ఎలక్ట్రిక్ బైక్‌ను త్వర లో మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఆ సంస్థ కు చెందిన ఆర్‌వీ 400, ఆర్‌వీ 300 మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి. దశలవారీగా ఆర్‌వీ 300 మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించి తక్కువ ధరలో ఆర్‌వీ 1 మోడల్ ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించింది. ఇది పూర్తిగా దేశీయంగా తయారయ్యే బైక్ అని రతన్ ఇండియా ప్రమోటర్ అంజలి రతన్ తెలిపారు. ప్రస్తుతం వీటికి చెందిన కొన్ని విడి భాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ డిసెంబరు నాటికి తమ ఉత్పత్తులన్నీ పూర్తిగా దేశీయ విడిభాగాలతోనే తయారవుతాయని ఆమె చెప్పారు.
రాబోయే ఏడాదిలోఈ-వాహనాల జోరు
దేశంలో రాబోయే 12 నెలల కాలంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పుంజుకుంటాయని ఎర్నె స్ట్ అండ్ యంగ్ తాజా నివేదికలో తెలిపింది.

