Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్.. వాళ్లు దొంగలు కాదు బాధితులే..

రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్.. వాళ్లు దొంగలు కాదు బాధితులే..

ఇంటర్‌నెట్ డెస్క్: మెక్సికో బ్యాట్‌మ్యాన్ ఘటనను జలిస్కో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బ్యాట్‌మ్యాన్ స్తంభాలకు కట్టేసిన వ్యక్తులను ప్రస్తుతానికి బాధితులుగానే పరిగణిస్తున్నారు.

చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులు స్పష్టం చేశారు. బ్యాట్‌మ్యాన్ చర్యలు చట్టవిరుద్ధమైన నిర్బంధం, దాడి కిందకు వస్తాయని అంటున్నారు. ఈ పనులు చేయటం ఒక వ్యక్తి వల్ల కాదని, ఓ బృందం కలిసి చేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడులకు ఉపయోగించిన రెండు అనుమానాస్పద వాహనాలను అధికారులు గుర్తించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

గత కొద్దిరోజుల నుంచి గుర్తు తెలియని ఓ వ్యక్తి జలిస్కో స్టేట్‌లో బైక్ దొంగతనాలకు పాల్పడే వారిని టార్గెట్ చేశాడు. వారిని పట్టుకుని స్తంభాలకు ప్లాస్టర్‌లతో కట్టేసి పోతున్నాడు. జూన్ 13వ తేదీన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి వెళ్లాడు. ఆ యువకుడి ముఖంపై గాయాలు ఉన్నాయి. ఆ యువకుడి దగ్గర ఓ కార్డ్‌బోర్డ్ ఉంది. అందులో.. 'ఇతడు మోటార్ సైకిళ్లను దొంగతనం చేస్తున్నాడు' అని రాసి ఉంది.

జూన్ 17, 19 తేదీల్లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో జనం గుర్తు తెలియని వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడికి 'బ్యాట్‌మ్యాన్ ఆఫ్ లాగోస్ డే మొరేనో' అని పేరు కూడా పెట్టారు. రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్ దొంగలను టార్గెట్ చేసి పట్టుకుంటున్నాడంటూ నెటిజన్లు హర్హం వ్యక్తం చేస్తున్నారు.

వైభవ్ అరంగేట్రంపై చర్చ.. సంజునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: పుజారా

మార్కెట్ స్టైల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్.. ఇంట్లోనే తయారు చేసుకోండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy