Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోబో రివర్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..

రోబో రివర్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..

ఇంటర్నెట్ డెస్క్: రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను ఓ వ్యక్తి నెట్టేందుకు ప్రయత్నించగా..

కొన్ని క్షణాల తర్వాత ఆ రోబో అతడిపై రివర్స్ ఎటాక్ చేసింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈ దృశ్యాలను 'ది టెర్మినేటర్‌' సినిమాలోని సన్నివేశాలతో పోలుస్తూ సరదాగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రోబోట్‌ నిజంగానే స్వయంగా స్పందించిందా? లేక ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా దాన్ని ఆపరేట్‌ చేశారా? అనే ప్రశ్నలు కూడా సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. వీడియోలో రోబోట్‌ కదలిక స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. దాని వెనుక ఉన్న టెక్నాలజీ సిస్టమ్.. ఆ సమయంలో రోబోట్‌ ఏ మోడ్‌లో పనిచేస్తుందనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. కొందరు మాత్రం దీన్ని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ 'రోబో తిరుగుబాటు' మొదలైందంటూ సరదా కామెంట్ చేశారు. 'రోబోట్‌ను మరీ ఎక్కువగా రెచ్చగొడితే ఇలాగే జరుగుతుంది' అని ఒకరు, 'మొదట ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది.. చివరికి సహనం కోల్పోయింది'అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy