Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

బొండపల్లి/ దత్తిరాజేరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): బొండపల్లి మండల కేంద్రం, దత్తిరాజేరు మండలంలో ని పెదమానాపురం పోలీసుస్టేషన్లను ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదివారం సందర్శించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నియంత్ర ణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారిపై జిగ్‌జాగ్‌ పద్ధతిలో స్టాపర్లను ఏర్పాటు చే యాలన్నారు. కూడళ్లు, మలుపులు, స్కూల్‌ జోన్స్‌ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పశువులు, గంజాయి అక్రమణ రవాణా నియంత్రణకు ఆకస్మిక తనిఖీలను చేపట్టాలన్నారు.

పోలీసు అధికారు లు, సిబ్బంది గ్రామాల్లో రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, హెల్మెట్‌ ధారణ పట్ల అవగాహ న కల్పించాలన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల సామరస్యంగాను, నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచిం చారు. పోలీసస్టేషన్‌ పరిధిలో ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చాలని, గస్తీ, జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించారు. పోలీసు సిబ్బం ది వివాహ వార్షికోత్సవాలు, జన్మదినాలకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనుమతి మంజూరు చేస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బంది తప్పనిసరి గా హెల్త్‌ ఇన్సురెన్స్‌ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ తనిఖీలో బొబ్బిలి డీఎస్పీ ఆర్‌.గోవింద రావు, గజపతినగరం సీఐ సన్యాసినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ.లీలారావు, బొండపల్లి ఎస్‌ఐ యు.మహేష్‌, పెద మానాపురం ఎస్‌ఐ కళాధర్‌, ఇతర పోలీసు అధికారు లు, సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy