Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజుకు రూ.6-8 లక్షలు.. రామమందిర విరాళాల చోరీ దర్యాప్తులో సంచలన విషయాలు..

రోజుకు రూ.6-8 లక్షలు.. రామమందిర విరాళాల చోరీ దర్యాప్తులో సంచలన విషయాలు..

యోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రాథమిక అంచనా ప్రకారం, భక్తులు సమర్పించిన నగదు నుంచి రోజుకు సుమారు రూ.6-8 లక్షలను నిందితులు కాజేసినట్టునట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ అక్రమాలు నెలల తరబడి కొనసాగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు (Ram Mandir donation theft).

ఇంతకు ముందు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంకు ఖాతాలకు రోజుకు సగటున రూ.16 నుంచి రూ.18 లక్షల వరకు విరాళాలు జమ అయ్యేవి. అయితే, ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాల్లో రోజుకు రూ.24 నుంచి రూ.26 లక్షలు జమ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు వెలుగులోకి రాక ముందు నిందితులు రోజుకు 6-8 లక్షలు కాజేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు (Ram Temple donation scam).

దర్యాప్తులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు (Ram Mandir SIT probe). విరాళాల లెక్కింపు ప్రక్రియలో పనిచేసిన కొందరు ఉద్యోగులు పథకం ప్రకారం నగదును పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆ డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.


బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy