Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ గవర్నర్, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలోని ఆలిండియా రేడియో జంక్షన్‌లో రోశయ్య విగ్రహాన్ని ఈరోజు (సోమవారం) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పళ్లా శ్రీనివాసరావు, మంత్రి టీజీ భరత్, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వంశీ, విష్ణు కుమార్ రాజు, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

రోశయ్య లాంటి రాజకీయాలకు మా తరం దూరమైంది..

రోశయ్యను స్టాట్యూ ఆఫ్ స్టేట్స్ మాన్‌గా నామకరణం చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు. తమలాంటి యువతకు రోశయ్య ఆదర్శమని పేర్కొన్నారు. రోశయ్య లాంటి రాజకీయాలకు తమ తరం దూరమైందని బాధపడుతున్నానని తెలిపారు. తమ తరం రాజకీయాల్లో మార్పు రావాలని చెప్పారు. ఆయన అన్ని పదవుల్లో పనిచేశారని.. తెలుగు జాతి కోసం ఆలోచించారని కొనియాడారు. రోశయ్య గురించి పుస్తకాలు రాయాలని, కుటుంబ సభ్యులతో కలిసి ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని తెలిపారు. అలాంటి కమిట్‌మెంట్ యువతలో ఉండాలని, ప్రతి ఒక్కరిలో ఉండాలని మంత్రి లోకేశ్ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..

వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy