Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో

రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో

అమరావతి, అక్టోబర్ 19: గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ (సీఈ) చినబాబుకు మెమో జారీ చేస్తూ ఏపీ ఇరిగేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాగు నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు 2025లో మంజూరు చేసిన రూ.256.75 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను నేటికీ అప్‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇరిగేషన్ శాఖ తీవ్రంగా స్పందించింది.

నీటి సంఘాల ఓఅండ్ఎం పనులకు సంబంధించిన బిల్లులను రికార్డు చేసే పర్యవేక్షణలో అలసత్వం వహించినట్లు ఆ శాఖ గుర్తించింది.

ఈ నేపథ్యంలో బిల్లలు అప్‌లోడ్‌లో జాప్యానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించినందుకు గోదావరి డెల్టా సీఈ చినబాబుకు ఈఎన్సీ మెమో జారీ చేసింది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy