Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ర్యాగింగ్ ఆరోపణల్లో హోం మంత్రి మహమూద్ అలీ మనవడు

ర్యాగింగ్ ఆరోపణల్లో హోం మంత్రి మహమూద్ అలీ మనవడు

హైదరాబాద్: రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడిపై ర్యాగింగ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. పంజాగుట్ట పోలీసులకు ఇద్దరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజీలో హోంమంత్రి మనవడు ఫర్హాన్ అలీ మహ్మద్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తమపై దాడి చేశాడని పంజాగుట్ట పోలీసులకు బాధిత విద్యార్థులు శనివారం ఫిర్యాదు చేశారు. వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేశామని బాధిత యువకులు అంటున్నారు. అయితే కేసు నమోదు చేయని పంజాగుట్ట పోలీసులు.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy