నల్గొండ: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఎం, సీపీఐ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌కు మద్దతుపై అధికారికంగా వామపక్షాలు ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఇప్పటికే సాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా మద్దతు ప్రకటించారు. బీసీలకు సాగర్ టికెట్ కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. బీసీలంతా భగత్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భగత్‌ను గెలిపించి కొత్త చరిత్రకు బీసీలు నాంది పలకాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.
ఇప్పటికే సాగర్‌లో టీఆర్‌ఎస్ ప్రచార హోరును పెంచింది. దీనికి తోడు ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు ఖాయమైంది.

