Dailyhunt
సాక్షి వార్త నిజమని తేలింది: రఘురామ

సాక్షి వార్త నిజమని తేలింది: రఘురామ

హైదరాబాద్: చివరికి తన పిటిషన్‌ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసిందని ఎంపీ రఘురామకృష్ణారాజు తెలిపారు. సాక్షి దినపత్రిక వార్త నిజమని తేలిందన్నారు.

సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదిస్తానని ఆయన ప్రకటించారు. త్వరలో హైకోర్టుకు వెళ్తానని, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని రఘురామ స్పష్టం చేశారు.

జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని రఘురామ తెలంగాణ హైకోర్టును కోరారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరించింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టులో రఘరామ వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. నేడు జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో జగన్‌, విజయసాయికి ఊరట లభించింది.

సీఎం జగన్‌పై రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ జనసేనతో వైసీపీకి ప్రమాదం.. రఘురామ హెచ్చరిక విశాఖకు రాజధాని వస్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy