Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సారీ.. సర్వర్‌ డౌన్‌

సారీ.. సర్వర్‌ డౌన్‌

  • గ్యాస్‌ వినియోగదారులకు ఈ-కేవైసీ పరేషాన్‌

  • గంటల తరబడి వేచిచూస్తున్నా.. పూర్తికాని పరిస్థితి

హైదరాబాద్‌ సిటీ: గ్యాస్‌ వినియోగదారులను ఈ-కేవైసీ పరేషాన్‌ చేస్తోంది.

ఏజెన్సీల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నప్పటికీ కనెక్షన్‌తో ఆధార్‌ సీడింగ్‌ కాకపోవడంతోపాటు కస్టమర్ల ఐరిష్‌ త్వరగా క్యాచ్‌ కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంట గ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వినియోగదారులు ప్రతి ఒక్కరూ ఈనెల 16లోగా తమ ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌ (ఈ-కేవైసీ)ని పూర్తి చేసుకోవాలని ఆయిల్‌ కంపెనీలు నిబంధనలు విధించిన నేపథ్యంలో గత 20 రోజులుగా గ్రేటర్‌లోని గ్యాస్‌ ఏజెన్సీల వద్ద తీవ్ర రద్దీ కనిపిస్తోంది.

ఉదయం 9గంటలకు ఆఫీసులను తెరుస్తున్నప్పటికీ.. సర్వర్‌ తరచూ మొరాయిస్తుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆధార్‌ సీడింగ్‌ త్వరగా కాకపోవడంతో వారిని మళ్లీ రావాలని సూచిస్తున్నారు. అలాగే 60 ఏళ్లకు పైబడిన వారి కంటిపాపలు ఐరిష్‌ కాకపోవడంతో పెండింగ్‌లో పడుతున్న పరిస్థితి నెలకొంటుంది.

 మొబైల్‌ యాప్‌లోనూ అంతే..!

కాగా, వినియోగదారులు గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు రాకుండా ఇంటివద్దనే ఈ-కేవైసీని చేసుకునేందుకు వివిధ కంపెనీలు మొబైల్‌ యాప్‌లో సైతం అవకాశాన్ని కల్పించాయి. అయితే యాప్‌ తెరిచి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత సర్వర్‌ మొరాయిస్తుండడంతో చాలామంది తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఏజెన్సీలకు వెళ్లకుండా సులభంగా చేసుకోవచ్చని చెబుతున్నా.. ఇబ్బందులు తప్పడం లేదని పలువురు వాపోతు న్నారు. ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో డొమెస్టిక్‌ (గృహ) కనెక్షన్లు సుమారు 40 లక్షలున్నాయి.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy