ఏటీఎం కేంద్రంలో ఏమార్చి కార్డు మార్పిడి, చోరీ
ఖానాపూర్, అక్టోబరు 29: ఏటీఎం కేంద్రం వద్ద సహాయం చేయాలని కోరితే.. కార్డు మార్చి.. 1.20లక్షలు కొట్టేశాడో కేటుగాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్కు చెందిన దానవేణి మల్లేశ్ గురువారం తన ఖాతాలోని డబ్బులు తీసేందుకు మెట్పల్లి పాత బస్టాండ్లోని ఏటీఎంకు వెళ్లాడు. నగదు డ్రా చేయడం రాకపోవడంతో అక్కడున్న వ్యక్తిని సాయం కోరాడు.
అతడు మల్లేశ్ కార్డు నుంచి రూ. 6వేలు తీసి, అనంతరం తన కార్డును అతడికిచ్చాడు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ రాత్రి వరకు మల్లేశ్ ఖాతా నుంచి పలుమార్లు రూ.10 వేల చొప్పున డ్రా చేస్తున్నట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోయిన మల్లేశ్ తెలిసిన వారికి తన ఏటీఎం కార్డును చూపించడంతో..
