Tuesday, 24 Nov, 4.49 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
సాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ 26కి వాయిదా

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్స్‌ కేసుకు సంబంధించి ఏ-2 విజయసాయిరెడ్డి పెట్టుకున్న డిశ్చార్జి పిటిషన్‌పై తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీఆర్‌ మధుసూదన్‌రావు ముందు విచారన జరిగింది.

విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్‌ కన్నన్‌, మాధవ్‌ రామచంద్రలు పెట్టిన రూ.24.66 కోట్లకు సంబంధించి మోసం చేశారని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొందని.. ఏకే దండమూడి పెట్టిన రూ.10 కోట్లకు సంబంధించి మోసం చేసినట్లు చెప్పలేదని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ (సీ) ప్రకారం విజయసాయిరెడ్డి పబ్లిక్‌ సర్వెంట్‌ పరిధిలోకి రారని వాదించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top