ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో నాలుగు బంతులాడిన విరాట్..
పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్లలో.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లీ ఖాతాలో అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 20 డకౌట్లు చేరాయి. సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్‌లో 20 సార్లు డకౌట్ అయ్యాడు. అయితే సచిన్ 463 మ్యాచ్‌ల్లో ఈ అన్‌వాంటెడ్ ఫీట్ అందుకోగా.. కోహ్లీ కేవలం 321 మ్యాచ్‌ల్లోనే ఈ సంఖ్యను చేరుకోవడం గమనార్హం.
అత్యధికసార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లు వీరే!
విరాట్ కోహ్లీ - 20 డకౌట్లు (321 మ్యాచ్‌లు)
సచిన్ టెండూల్కర్ - 20 డకౌట్లు (463 మ్యాచ్‌లు)
జవగళ్ శ్రీనాథ్ - 19 డకౌట్లు (229 మ్యాచ్‌లు)
అనిల్ కుంబ్లే - 18 డకౌట్లు (269 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ - 18 డకౌట్లు (295 మ్యాచ్‌లు)
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. రోహిత్ శర్మ(0) గోల్డెన్ డక్, కోహ్లీ(0), శ్రేయస్ అయ్యర్(0) డకౌట్‌గానే పెవిలియన్ చేరారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 333 పరుగులు చేయగా, ఛేదనలో భారత్ 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.
strong>
టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!
న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2

