మోసాలపై అప్రమత్తతే లక్ష్యం: శిఖాగోయల్
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ సైబర్ జాగరూకతా దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 438 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 82,573 మందిని భాగస్వాములను చేశారు.
డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడి మోసాలవంటి సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖాగోయల్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలు, ప్రధాన ప్రదేశాల్లో సైబర్ భద్రతపై భారీ ప్రచారాన్ని చేపట్టనున్నామని ఆమె వివరించారు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు చేసేటప్పుడు విక్రేతలు, వెబ్‌సైట్లు, ఆఫర్లను పూర్తిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్‌లో సకాలంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..

