కర్నూలు(కలెక్టరేట్), ఏప్రిల్ 22: జిల్లాలో సెకండ్ వేవ్ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. సమన్వయంతో పని చేస్తేనే కట్టడి సాధ్యమవుతుందన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ ఫలితాలు 24 గంటల్లోగా ఇవ్వాలన్నారు. కొవిడ్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేటు హాస్పిటళ్లలో నిర్దేశిత ఫీజులు మాత్రమే తీసుకోవాలన్నారు. జీజీహెచ్‌లో ఫిర్యాదులకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా.భగవాన్‌కు సూచించారు.
