Dailyhunt
సమయ పాలన పాటించాలి

సమయ పాలన పాటించాలి

వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆస్పత్రుల్లో ఉండాల్సిందే

ప్రైవేటు కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో

ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలి

ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో

జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటిం చాలని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఆరోగ్య కేంద్రాల్లో ఉండాల్సిందేనన్నారు. బుధవారం జగదాంబ సెంటర్‌ ప్రాంతంలో గల బిల్‌ జంక్షన్‌ హాలులో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన పట్టణ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ సమయ పాలన విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో ఓపీ పెంచగలిగితే కేజీహెచ్‌లో రద్దీని తగ్గించ వచ్చునన్నారు. వైద్యులు అందుబాటులో ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రసవాలు ప్రైవేటు కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఎక్కువ జరిగేలా చూడాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం ఐదు ప్రసవాలు తప్పనిసరిగా జరిగేలా చూడాలని ఆదే శించారు. ప్రధాన మంత్రి మాతృత్వ వందన పథకాన్ని ఎక్కువ మందికి చేరేలా చూడాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలు అందరికీ ఇవ్వాలన్నారు. అడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని, ఇతర శాఖల సహ కారంతో 60 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని, డ్రై డే పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు మాట్లా డుతూ విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించ వద్దన్నారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జీవన్‌రాణి, డాక్టర్‌ పూర్ణేంద్రబాబు, డాక్టర్‌ బి.ఉమా వతి, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy