Tuesday, 07 Jul, 8.04 pm ఆంధ్రజ్యోతి

అమరావతి
సముద్రంలోని షార్క్‌ను అమాంతం ఎత్తుకెళ్లిన పెద్ద పక్షి

చిన్న చిన్న చేప పిల్లలను కొంగలు, గద్దలు ఎత్తుకెళ్లడం కామన్. చెరువులు, కాలువల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏకంగా ఓ షార్క్ ను పక్షి ఎత్తుకెళ్లడం చూశారా?. ఏంటి అంతపెద్ద చేపను పక్షి ఎత్తకెళ్లడమా?. అసాధ్యం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజంగా జరిగింది. ఓ పెద్ద షార్క్ ను భారీ పక్షి ఎత్తుకెళ్లింది. అమెరికాలోని ఓ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. బీచ్ లో పర్యటకులు సముద్ర అందాలను ఆశ్వాదిస్తూ జలకాలాటలు ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా ఓ భారీ పక్షి వచ్చింది. సముద్రం మీదకు వచ్చి ఓ షార్క్‌ను అమాంతం ఎత్తుకెళ్లింది. అదేదో పిల్ల చేప కాదు భారీ చేపనే ఆ పక్షి ఎత్తుకెళ్లింది. దాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top