Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంచయితకు హైకోర్టులో షాక్.. అశోక్ గజపతి రాజు పునర్నియామకం

సంచయితకు హైకోర్టులో షాక్.. అశోక్ గజపతి రాజు పునర్నియామకం

విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతంలో ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ.. సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. జీవోలను సవాల్ చేస్తూ అశోక్‌గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఏపీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. పాత జీవోల ప్రకారం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా అశోక్ ఉంటారని పేర్కొంది.

ఇదిలా ఉంటే, అశోక్ గజపతి రాజుపై సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మాన్సాస్ చైర్మన్‌గా, సింహాచల దేవస్ధానం అనువంశిక ధర్మకర్తగా కొనసాగే అర్హత అశోక్ గజపతిరాజుకే ఉందని ప్రకటించటంతో, న్యాయం గెలిచిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy