Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంజయ్‌పురి కాలనీలో టీఆర్ఎస్ నాయకుల నగదు పంపిణీ

సంజయ్‌పురి కాలనీలో టీఆర్ఎస్ నాయకుల నగదు పంపిణీ

హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అలాగే పలు జిమ్మిక్కులు చేస్తున్నారు. జగద్గిరిగుట్ట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌ అనుచరులు సంజయ్‌పురి కాలనీలో ఇంటింటికీ తిరిగి డబ్బులు పంచుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులకు ఓటర్లు ఫోన్ చేసి చెప్పారు. బీజేపీ నేతలు అక్కడకు చేరుకొని నగదు పంచుతున్న టీఆర్ఎస్ నాయకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు నగదు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పోలీసులు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy