Dailyhunt
సర్కారు భూములను అమ్మడం అనైతికం: ఇందిరాశోభన్‌

సర్కారు భూములను అమ్మడం అనైతికం: ఇందిరాశోభన్‌

హైదరాబాద్: సర్కారు భూములను అమ్మడం అనైతికమని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్‌ అన్నారు. సోమవారం ఇందిరాశోభన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా అవసరాల కోసమే భూములను వినియోగించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూముల విక్రయం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేనిపక్షంలో ప్రభుత్వంపై పోరాటం తప్పదని ఇందిరాశోభన్‌ హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy