Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ

షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్‌గా పాల్గొననున్న కార్యక్రమంపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది (Sheikh Hasina Virtual Address). ఆ కార్యక్రమం నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.

బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హసీనా వర్చువల్‌గా ప్రసంగించనున్నారు.

భారత భూభాగం నుంచి షేక్ హసీనా బంగ్లా అంతర్గత రాజకీయాల గురించి మాట్లాడడంపై వివాదం నెలకొంది. హసీనా భారతదేశంలో రాజకీయ ప్రసంగం ఇవ్వడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడొచ్చని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు దేశం భారత్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు చెడిపోవాలని తాము కోరుకోవడం లేదని బంగ్లా విదేశాంగశాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు (India Bangladesh Relations).

బంగ్లా ఆరోపణలపై భారత్ విదేశాంగ శాఖ స్పందించింది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహిస్తోందని తెలిపింది. షేక్ హసీనా ప్రసంగానికి, భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని, ఆ వేదికపై వ్యక్తమయ్యే అభిప్రాయాలు ప్రభుత్వ అధికారిక వైఖరిని ప్రతిబింబించవని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy