Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

శీతాకాలం.. కరోనాతో మరింత అప్రమత్తం

జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయండి: కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): శీతాకాలం ప్రవేశిస్తోందని.. వివిధ పండుగలు, పర్వదినాలు సమీపిస్తున్నాయని.. అందువల్ల కరోనా విషయంలో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సూచించారు.

ఇప్పటికే రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy