ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్‌లో యువ స్పిన్నర్ శ్రీ చరణి అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది.
ఇక, రేటింగ్ పాయింట్ల విషయంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీ చరణి 817 రేటింగ్ పాయింట్లకు చేరుకుంది. మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ చరిత్రలో ఇదే అత్యధిక రేటింగ్ (Sree Charani No 1 T20I bowler).
శ్రీ చరణి ఇప్పటికే మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో ఉంది. తాజాగా ఆమె రేటింగ్ 817 పాయింట్లకు చేరడంతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అంతేకాదు.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ పేరిట ఉన్న అత్యధిక రేటింగ్ రికార్డును కూడా అధిగమించింది. 2018 నవంబర్‌లో మేగన్ షట్ 806 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఇప్పుడు శ్రీ చరణి 817 పాయింట్లతో ఆ రికార్డును 11 పాయింట్ల తేడాతో అధిగమించింది (ICC Women T20I rankings).
శ్రీ చరణి ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉంది (Sree Charani 817 points). మహిళల ఆసియా కప్‌లో భారత్ టైటిల్ సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. టోర్నీలో మొత్తం 12 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఆమె 4 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలకంగా నిలిచింది. భారత్ ఆ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో గెలిచి ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్

