డిస్‌పూర్ : అసోం విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అనింద్య సేన్‌పై సిల్చర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీరాముడిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, హిందూ మత భావాలను కించపరచారని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
శ్రీరాముడు, ఆయన భార్య సీతను వదిలేసిన సందర్భం గురించి ఆగస్టు ఐదున అనింద్య సేన్ తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో... మొదటి లైన్‌లో 'జరుగుతున్న ఈ డ్రామా అంతా భార్యను వదిలేసిన ఒక వ్యక్తి కోసమా...' అని ఆయన రాశారు.

