Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత

శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత

నంద్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మల్లన్న ఆలయానికి (Srisailam Temple) భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అలాగే, వరుణయాగం సందర్భంగా ఈరోజు (ఆదివారం) , రేపు (సోమవారం) ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు నిలిపివేశారు.

భక్తుల వాహనాలు ఎక్కువగా రావడంతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో శ్రీశైలం రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం టోల్‌గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వార్తలు కూడా చదవండి...

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy