Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

 బుధవారం హుండీ ఆదాయం: రూ.6.94 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 69,771

తలనీలాలు సమర్పించినవారు: 25,888


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy