Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'షుగర్ డాడీని కూడా చంపేస్తా'.. గువాహటి ఘటన నిందితుడి కీలక వ్యాఖ్యలు

'షుగర్ డాడీని కూడా చంపేస్తా'.. గువాహటి ఘటన నిందితుడి కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: అస్సాం రాష్ట్రం గువాహటిలోని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. భార్య శవం నుంచి తలను వేరు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. పెళ్లైన కొన్ని నెలల్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఈ ఘటనలో తాజాగా నిందితుడు రామానుజ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. షుగర్ డాడీని కూడా చంపేస్తా అంటూ గువాహటిలోని కోర్టుకు తీసుకెళ్తుండగా రామానుజ్ ఈ ప్రకటన చేశాడు.

నిందితుడు రామానుజ్ విలేకరులతో మాట్లాడుతూ... తాను తన భార్యను చంపానని, జైలు నుంచి విడుదలయ్యాక 'షుగర్ డాడీ' అని పిలిచే వ్యక్తిని కూడా తప్పకుండా చంపుతానని వెల్లడించాడు. ఆ వ్యక్తి ఎవరని జర్నలిస్ట్ లు పదే పదే అడగ్గా.. అతను ఆగ్రహానికి గురై మీడియా సభ్యులతో దురుసుగా ప్రవర్తించాడు. అలానే తన భార్యను చంపినందుకు పశ్చాతాపం లేదని, క్షమాపణలు కూడా చెప్పనని తెలిపాడు. వారం రోజుల పాటు తప్పించుకుని తిరిగిన నిందితుడు ఆదివారం సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాజాగా అతడు షుగర్ డాడీని కూడా చంపేస్తా అని చెప్పడంతో.. ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు భార్యను చంపడానికి, మరొకరిని చంపేస్తానని వ్యాఖ్యలు చేయడానికి ఏర్పడిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

అసలు ఏం జరిగిందంటే..

గువహటికి చెందిన రియా తాలుక్‌దర్ అనే యువతికి కొన్ని నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన రామానుజ్ గోస్వామి అనే వ్యక్తితో పెళ్లయింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, వారం రోజుల క్రితం రియాను ఆమె భర్త చంపేశాడు. తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. తలను ఫ్రిడ్జ్‌లో దాచి ఇంటినుంచి పరారయ్యాడు.ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో సెప్టెంబర్ 6వ తేదీన పొరిగిళ్ల వారు పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి లోపల రియా శరీర భాగాలను గుర్తించారు.


స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు: హరీశ్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy