విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం డెస్టినీ నగరంలో రేపు (గురువారం) ప్రారంభం కానున్న 31వ సీఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి (CII Partnership Summit) ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు.
కొత్త ఆలోచనలు, గొప్ప ఆశయాలతో వస్తున్న ప్రతినిధులందరికీ హృదయపూర్వక స్వాగతమని తెలిపారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు. ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక దిగ్గజాలు, స్ఫూర్తిదాయక నాయకులు ఒకచోట చేరనున్నారని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ సమ్మిట్ ప్రారంభానికి హాజరుకానున్నారని తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత గొప్ప శిఖరాలకు చేర్చడానికి ఎదురుచూస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..

