నారాయణరావుపేట, అక్టోబరు 29: వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంచలో జరిగింది. పంటి చికిత్సకై ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలు(60) బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తోంది.
ఈ క్రమంలో రామంచకే చెందిన కొమ్ము నర్సింహులు ఆమెను ఇంటి వద్ద దింపుతా అని తన బైక్‌పై ఎక్కించుకుని, సిద్దిపేట రహదారిలో అత్యాచారానికి చేసి పరారయ్యాడు. ఇంటికి చేరిన బాధితురాలు భర్తతో కలిసి చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
