సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాణిరుద్రమ దేవి విమర్శించారు. సింగూర్ జలాలను ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు దక్కకుండా దోచుకుపోయిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. కరోనాను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం చెందిందని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను భ్రష్టు పట్టించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టి సామాన్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు,అభివృద్ధి పిలుపుతోనే అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసమే యువ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని ఆమె అన్నారు.
