సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించే తెలుగు చిత్రసీమ మరోసారి ప్రజలకు తమ వంతు సాయాన్ని అందచేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా తామూ ఉన్నామంటూ టాలీవుడ్ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది.
అందులో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరంజీవి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. మహేశ్‌బాబు కోటి రూపాయలను తన వంతు సాయంగా అందించటానికి ముందుకు వచ్చారు. నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించారు.

