Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సీఎంను మారిస్తే దళితుడికే పదవివ్వాలి: టీపీసీసీ

హైదరాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): సీఎంను మార్చాలనుకుంటే దళితునికి ఆ పదవిని ఇచ్చి.. కేసీఆర్‌ తన హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ డిమాండ్‌ చేసింది. గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఈ ప్రస్తావన తేవడం ద్వారా కేసీఆర్‌ అసమర్థ సీఎం అని ఆ పార్టీ నాయకులే ఒప్పుకొంటున్నారని వ్యాఖ్యానించారు. కాగా, దళితుడిని సీఎం చేస్తానన్న మాటను కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌ను సీఎంను చేసే ముందు దళితుడిని సీఎం చేస్తే తమకు న్యాయం జరుగుతుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy